భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: దస్తురాబాద్ మండలంలోని అకొండపేట గ్రామంలో శుక్రవారం జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ ఆధ్వర్యంలో జన సురక్ష సాచురేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్తులకు, మహిళా స్వయం సంఘాలకు ఆర్థిక భాగస్వామ్యం, జన్ ధన్ ఖాతాలు, కేవైసీ ప్రాముఖ్యత, రుణాలు, సైబర్ నేరాలు, అప్రమత్తత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, మహిళా స్వయం సంఘాల సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు: 

నిర్మల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: టోల్…