భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: పటాన్‌చెరు పట్టణంలో ఛట్ పూజ పండుగ సందర్భంగా మాదిరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ఎండీఆర్ ఫౌండేషన్ చెరుకు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఉత్తర భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పర్వదినం సందర్భంగా, పటాన్‌చెరు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ స్నేహభావంతో జీవిస్తుండడం అద్భుతమన్నారు. అందరి సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం ఫౌండేషన్ కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ఛట్ పర్వదినం అందరికీ ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి చేకూర్చాలని…