August 22, 2025 2:33 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Union Government: మూడు కీలక బిల్లులను జేపీసీకి పంపిన కేంద్రం

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో అధికార విపక్షాల మధ్య మాట యుద్ధమే జరుగుతోంది. ఈ క్రమంలోనే సభ సమావేశాలు సజావుగా జరగడం లేదు. తాజాగా కేంద్రంలోని మోదీ సర్కార్ మూడు కీలకమైన బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. దీని తీవ్రంగా వ్యతిరేకించారు విపక్ష ఇండియా కూటమి నేతలు. అయినప్పటికీ విపక్షాల ఆందోళన మధ్యే కేంద్రం ఆ బిల్లులను ప్రవేశపెట్టి.. జేపీసీకి పంపింది.

 

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు (ప్రజాప్రతినిధుల ఉద్వాసన బిల్లు) 2025, జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2025, కేంద్ర పాలిత ప్రాంతాల (సవరణ) బిల్లు 2025 వంటి బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

 

ఈ బిల్లు ప్రకారం ఏదైనా కేసులో సీఎం లేదా పీఎం 30 రోజుల కంటే ఎక్కువ రోజులు జైలులో ఉంటే వారిని ఆ పదవి నుంచి తొలగించేలా కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. ప్రజాప్రతినిధులు వాళ్లంతట వాళ్లే రాజీనామా చేయకపోయినా ఈ కొత్త రూల్ ప్రకారం వారి పదవిని కోల్పోనున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం తీసుకువచ్చిన బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు క్రూరమైందని.. ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసే పరిస్థితి ఏంటని మండిపడుతున్నాయి.

 

మరిన్ని కథనాలు: 

Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Share This Post