భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతుంది. గతంలో జగిత్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత కొండా మురళిలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీలో మంటలు రేపుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పదవులు మీకే, పైసలూ మీకేనా అని సీఎం రేవంత్…