August 18, 2025 3:49 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Fastag Annual Pass: అందుబాటులోకి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్

భారత్ సమాచార్.నెట్: వాహనదారులకు గుడ్ న్యూస్ ఫాస్టాగ్ వార్షిక పాస్ అందుబాటులోకి వచ్చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వార్షిక పాస్‌ను ప్రారంభించింది. నేషనల్ హైవేస్‌పై వాణిజ్యేతర వాహనదారులపై టోల్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు ఈ వార్షిక పాస్‌ను తీసుకొచ్చింది కేంద్రం. ఈ వార్షిక పాస్ కేసం వాహనదారులు కేవలం 3వేలు చెల్లించాల్సి ఉంటుంది.

 

ఈ యాన్యువల్ పాస్‌‌ను ఒక్కసారి రీఛార్జ్ చేస్తే.. మళ్లీ ఏడాదికి చేసుకోవాల్సి ఉంటుంది. జాతీయ రహదారులపై ఎక్కువ ప్రయాణించేవారికి ఇది ఎంతో ఉపయోగపడనుంది. అయితే ఈ పాస్ కేవలం కార్లు, జీపులు, ప్రైవేటు వాహనాలు, వ్యాన్లకు మాత్రమే పనిచేస్తుంది. వాణిజ్య వాహనాలకు ఈ పాస్ ఉండదు. ఈ ఫాస్టాగ్ తీసుకోవడం వల్ల టోల్ గేట్స్‌ వద్ద వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

 

ఇక ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలు వంటి టోల్‌ ప్లాజాలలో మాత్రమే పనిచేస్తుంది. అయితే వార్షిక పాస్ తీసుకోవడం తీసుకువడం అనేది వాహనదారుడి అభిప్రాయం. వార్షిక పాస్ తీసుకోవడం ఇష్టం లేని వారు ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లింపు చేసుకోవచ్చు. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలనుకున్న వారు ఎన్‌హెచ్ఏఐ లేదా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లకి వెళ్లి అక్కడా ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

 

Share This Post