August 18, 2025 3:57 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

PM Modi: ప్రధాని మోదీ నయా రికార్డు

భారత్ సమాచార్.నెట్: ప్రధాని మోదీ మరో రికార్డు సృష్టించారు. స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన రాజకీయ ప్రస్థానంలోనే అతి పెద్ద వ్యవధిగల ప్రసంగం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురువేసిన అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించిన ప్రధాని మోదీ ప్రసంగించారు. 105 నిమిషాల పాటు నిరవధికంగా ప్రసంగించి ఆయన రికార్డును ఆయనే అధిగమించారు.

 

ఈ ఉదయం 7.33 నిమిషాలకు తన ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఉదయం 9.18 నిమిషాలకు ముగించారు. గతంలో కూడా అనేక సార్లు మోదీ ఇలా సుదీర్ఘా ప్రసంగాలు చేశారు 2016లో 96 నిమిషాలు, 2019లో 92 నిమిషాలు, 2023లో 90 నిమిషాలు.. ఈ ఏడాది 2025లో 105 నిమిషాలు ప్రసంగించి రికార్డు సృష్టించారు. అయితే 2017లో కేవలం 56 నిమిషాల వ్యవధిలోనే తన ప్రసంగాన్ని ముగించారు ప్రధాని మోదీ.

 

అంతేకాదు ఎర్రకోట నుంచి వరుసగా 12సార్లు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన వ్యక్తిగా కూడా ప్రధాని మోదీ నిలిచారు. ఈ నేపథ్యంలోనే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సాధించిన రికార్డును బ్రేక్ చేశారు. అయితే 2017లో కేవలం 56 నిమిషాల వ్యవధిలోనే తన ప్రసంగాన్ని ముగించారు ప్రధాని మోదీ. ఇక ఈ ఏడాది జరిగిన ఇండిపెండెన్స్ వేడుకల్లో తన ప్రసంగంలో ప్రభుత్వ విజయాలు, నయా భారత్ నిర్మాణ దిశగా వేస్తున్న అడుగులు, వికసిత భారత్, ఆపరేషన్ సింధూర్, భవిష్యత్ కార్యాచరణ వంటి విషయాలపై మోదీ మాట్లాడారు.

Share This Post