August 18, 2025 3:57 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు.. పార్టీలో మంటలు పుట్టిస్తున్న జగ్గారెడ్డి వ్యాఖ్యలు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: టీ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కోవర్టులు ఉన్నారని ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు చల్లారక ముందే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. శుక్రవారం జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి పార్టీలోనూ ఒకరు, ఇద్దరు కోవర్టులు ఉంటారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా బీజేపీ కోవర్టులు ఉన్నారన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో మంటలు పుట్టిస్తున్నాయి. ఇంతకీ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులు ఎవరనే ఉత్కంఠకు తెరలేసింది. ప్యాకేజీ ఇస్తామంటే స్క్రిప్ట్ చదువుతూ ఉంటారని ఆరోపించారు. రాజకీయాల్లో కోవర్ట్‌ వ్యూహం ఎప్పటి నుంచో ఉందన్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించే జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంత్రి పదవి ఇస్తానని ఇవ్వలేదని, తనకు మంత్రి రాకుండా కొంతమంది పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇలా తరచుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంత పార్టీ నాయకులపై చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి ఏ మేరకు గాడిలో పెడతారనేది వేచి చూడాలి.

 

మరిన్ని కథనాలు:

కాంగ్రెస్‌లో అసంతృప్తితోనే ఉన్నాను!

Share This Post