భారత్ సమాచార్.నెట్, కర్ణాటక: దేశంలో రోజుకురోజుకు హత్య ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉత్తర కర్ణాటకలోని కార్వర్ గ్రామానికి చెందిన మంజునాథ్ బజయ్య చెన్నయ్య 2002లో తన మేనమామను హత్య చేశాడు. ఈ కేసులో అతడు జైలు కెళ్లి 14 ఏళ్లు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాడు. తిరిగి 2016లో జైలు నుంచి విడుదలయ్యాక దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రవీశ్ గణపతి చెన్నయ్య(35)తో మంజునాథ్‌కు స్నేహం కుదిరింది. వీరు ఇద్దరూ గత కొంతకాలంగా కలిసి కూలీ పనులకు వెళ్తున్నారు.
రూ.200 కోసం హత్య చేశాడు:
ఈ క్రమంలోనే గత రాత్రి ఇద్దరూ మద్యం సేవించారు. అనంతరం మంజునాథ్ ఇంటి వద్దకు వచ్చారు. అక్కడ కూలీ డబ్బుల విషయమై ఇద్దరికి గొడవ జరిగింది. మంజునాథ్‌కు రూ.500 కూలీ డబ్బులు రావాల్సి ఉండగా.. రవీశ్ గణపతి రూ.300 మాత్రమే చెల్లించాడు. మిగిలిన రూ.200 ఇవ్వకపోవడంతో రవీశ్‌తో మంజునాథ్ గొడవకు దిగాడు. ఆగ్రహానికి గురైన మంజునాథ్ కొడవలితో రవీశ్ తలపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో రవీశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. రవీశ్ భార్య ఫిర్యాదు మేరకు సిరి రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మంజునాథ్‌ను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని కథనాలు: