భారత్ సమాచార్.నెట్, జనగామ: స్నేహం పేరుతో నమ్మించి ఒక యువతిపై పది మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లాలో జరిగింది. పోలీసులు పది మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లాకు చెందిన మహమ్మద్ ఒవైసి, ముత్యాల పవన్ కుమార్, బౌద్ధుల శివ కుమార్, నూకల రవి, జెట్టి సంజయ్, ఎం.డి. అబ్దుల్ ఖయూం, పుస్తకాల సాయితేజ, ముట్టాడి సుమంత్ రెడ్డి, గుండ సాయిచరణ్ రెడ్డి, ఒరుగంటి సాయి రామ్ అనే యువకులు ఒక యువతితో పరిచయం పెంచుకున్నారు. స్నేహం పేరుతో ఆమెను జనగాం-సూర్యాపేట రోడ్డులోని ఓ లాడ్జికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. నిందితుల్లో ఒకడు యువతిని గోవాకు తీసుకెళ్లి కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాధితురాలి అత్తకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పది మంది నిందితులను అరెస్టు చేసి, విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని కథనాలు