భారత్ సమాచార్.నెట్, జగిత్యాల: జగిత్యాల టౌన్‌కు చెందిన ఒక వ్యక్తి క్రెడిట్ కార్డు నుంచి సైబర్ నేరగాళ్లు రూ.40 వేలు కొట్టేశారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన రమేశ్‌కు ఆర్బీఎల్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉంది. తన క్రెడిట్ లిమిట్‌ను పెంచుతామని ‘నో బ్రోకర్’ యాప్ ద్వారా వచ్చిన మెసేజ్‌లోని నంబర్‌కు రమేశ్ కాల్ చేశాడు. సైబర్ నేరగాళ్లు అతని క్రెడిట్ లిమిట్ రూ.41 వేలను పెంచుతామని నమ్మబలికి ఒక యాప్ లింక్ పంపించారు. ఆ లింక్‌ను రమేశ్ ఓపెన్ చేయగానే అతని అకౌంట్ నుంచి రూ.40,997 కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన రమేశ్, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని కథనాలు