భారత్ సమాచార్.నెట్: దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓట్ చోరీ వివాదం వేళ.. రాహుల్ ఆరోపణలకు కేంద్ర ఎన్నికల సంఘం బదులిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు అంటే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఓట్ చోరీ వివాదంపై ఈసీ ఎలాంటి వివరణ ఇస్తుందో దానిపై ఆసక్తి నెలకొంది.
అయితే రాహుల్ గాంధీ చేపడుతున్న ఓటర్ అధికార్ యాత్ర కూడా రేపే ప్రారంభం కానుంది. ఓవైపు ఈసీ ప్రెస్ మీట్.. మరోవైపు రాహుల్ గాంధీ ఓటర్ యాత్ర రెండు ఒకే రోజు రానుండటంతో చర్చనీయాంశమవుతోంది. సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అప్పుడు మాత్రమే మీడియా ముందుకు వచ్చేది. ఇప్పుడు ఓట్ చోరీ వివాదంపై వివరణ ఇచ్చేందుకు మీడియా ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇకపోతే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన బీజేపీ, ఈసీ కలిసి ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు పాల్పడుతున్నాయని ఇటీవల రాహుల్ గాంధీ ప్రజేంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ ఓటు చోరీ వివాదంపై అటు అధికార.. ఇటు ఎన్నికల సంఘం ఖండిస్తూ.. రాహుల్ గాంధీకి కౌంటర్ ఇస్తున్నారు. కాగా ఓటర్ తొలగింపు ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ.. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ బీహార్‌లో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే.
మరిన్ని కథనాలు:
Election Commission of India: ఆధారాలున్నాయా..? రాహుల్‌కు ఈసీ సూటి ప్రశ్న