August 18, 2025 3:49 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Aamir Khan: ఆయనపై ఉన్న ప్రేమని డబ్బుతో వెలకట్టలేను: ఆమిర్ ఖాన్

భారత్ సమాచార్.నెట్: సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కూలీ’. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళ సినిమా చరిత్రలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించింది. రజినీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘కూలీ’ నిలిచింది.

 

అయితే ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు స్టార్ హీరో నాగార్జున విలన్‌గా, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్లు ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. అయితే అతిథి పాత్రలో కనిపించిన ఆమిర్ ఖాన్ రెమ్యునరేషన్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతిథి పాత్రలో కనిపించేందుకు ఆమిర్ ఖాన్ ఏకంగా రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చిన ఊహాగానాలకు తెరపడలేదు.

 

ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్వయంగా ఆమిర్ ఖాన్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. రెమ్యునరేషన్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్‌‌తో స్క్రీన్ పంచుకోవడం కోట్ల రూపాయల కంటే ఎంతో విలువైనదని పేర్కొన్నారు. తలైవాపై తనకు ఉన్న ప్రేమ, అభిమానానికి డబ్బుతో విలువ కట్టలేమని ఆమిర్ ఖాన్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన రెమ్యునరేషన్‌పై వస్తున్న వార్తలకు చెక్ పడినట్లైంది.

మరిన్ని కథనాలు:

OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న మూవీస్ ఇవే

Share This Post