భారత్ సమాచార్.నెట్, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ పట్టణంలో వర్షం బీభత్సం సృష్టించింది. కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. జిల్లా కేంద్రంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా, గురుప్రసాద్ హోటల్ ప్రాంతంలోని సీసీ రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. రోడ్డంతా గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డుపై గుంతలు కనిపించకపోవడంతో వాహనాలు జారిపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఆ గుంతల రోడ్డుపై వెళ్లాలంటే భయంగా ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రజలు ఇప్పటికే అనేక అసౌకర్యాలు ఎదుర్కుంటుండగా, మరోవైపు వర్షం వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
