August 18, 2025 3:56 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

మహానటి.. ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చి వగలఏడుపు

భారత్ సమాచార్.నెట్, శ్రీకాకుళం: ప్రియుడి మోజులో పడి ఓ భార్య ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని ఎస్సీ కాలనీ శివారులో ఈ నెల 7న ఓ వ్యక్తి మృతదేహం, మృతదేహం పక్కనే అతని బైక్ కూడా ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు పాతపట్నం మొండిగొల్ల వీధికి చెందిన నల్లి రాజు(27)గా గుర్తించారు. 

ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చింది:

పాతపట్నంలోని మొండిగొల్ల వీధికి చెందిన నల్లి రాజుకు ఎనిమిదేళ్ల క్రితం మౌనికతో వివాహరమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొంత కాలంగా మౌనిక పాతపట్నంకు చెందిన గుండు ఉదయ్ కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి పలుమార్లు భర్త, కుటుంబ సభ్యులు మందలించారు. అయినప్పటికీ వివాహేతర సంబందం మోజులో ఉన్న మౌనిక తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే హతమార్చాలని ప్లాన్ రచించింది. దానికోసం ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ప్రియుడు ఉదయ్ కుమార్ కూడా రాజు చనిపోతే తాను తన భార్యకి విడాకులు ఇచ్చేస్తానని అప్పుడు ఇద్దరం కలిసి హ్యాపీ గా ఉండవచ్చని చెప్పాడు. ఈనెల 5వ తేదీన మౌనిక రాజుకు పెట్టిన భోజనంలో నిద్ర మాత్రలు వేసింది. కాసేపటికి రాజు మత్తులోకి వెళ్ళిపోయాడు. ఇక అర్ధరాత్రి దాటాక మౌనిక ప్రియుడు ఉదయ్ కుమార్‌, అతడు తన స్నేహితుడు మల్లిఖార్జున్ మత్తులో ఉన్న రాజుకి దిండును ముఖంపై అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు.

భర్తను హతమార్చి వగలఏడుపు:

రాజు ప్రమాదవశాతు బైక్ పై నుంచి పడి చనిపోయినట్టు అంతా అనుకుంటారని హంతకులు భావించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మరునాడు ఉదయం బంధువులకు ఫోన్ చేసి రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన భర్త తిరిగి ఇంటికి రాలేదని మౌనిక అందరికి చెప్పింది. ఆ తర్వాత స్థానికులు రాజు మృతదేహాన్ని గుర్తించి మౌనికకు సమాచారం ఇవ్వగా ఏమి తెలియనట్టు నటిస్తూ వగల ఏడుపులు ఏడుస్తూ వచ్చింది. అయితే చివరకు పోలీసు విచారణతో వారి బండారం బయటపడడంతో కంగుతిన్నారు. నిందితులు భార్య మౌనిక, ఉదయ్ కుమార్, మల్లికార్జున్‌లను అరెస్ట్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని కథనాలు:

దారుణం.. యువతిపై ప‌ది మంది సామూహిక అత్యాచారం

Share This Post