August 18, 2025 3:51 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం.. ఐదుగురు స్పాట్‌డెడ్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: దేశవాప్తంగా శ్రీకృష్టాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో నిర్వహించినశ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపు రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉప్పల్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని రామంతాపూర్‌లోని గోకుల్‌నగర్‌‌లో ఊరేగింపు ముగిశాక రథాన్ని లోపలికి తోస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రథాన్ని లాగుతున్న వాహనం చెడిపోవడంతో దాన్ని పక్కకు నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో విద్యుత్‌ తీగలు రథానికి తగలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సీపీఆర్‌ చేసేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. మృతులు కృష్ణ యాదవ్‌ (24), శ్రీకాంత్‌రెడ్డి (35), సురేష్‌ (34), రుద్రవికాస్‌ (39), రాజేంద్రరెడ్డి (39)గా పోలీసులు గుర్తించారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share This Post