భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలశయాలకు భారీగా వరద నీరు పొటెత్తింది. హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మరోసారి మొసలి ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపింది.
బండరాయిపై మొసలి ప్రత్యక్షం.. పిల్లలు పరుగో పరుగు:
లంగర్‌హైస్ ప్రాంతంలోని మూసీ నది ఒడ్డున మొసలి ప్రత్యక్షం కావడంతో నది ఒడ్డును ఆడుకుంటున్న కొందరు పిల్లలు నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద బండరాయిపై ఉన్న మొసలిని చూసి భయపడి అక్కడి నుంచి పరుగులు తీశారు. కొందరు మొసలికి రాయిపై కదులుతున్న వీడియోలను తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం వైరల్ గా మారింది. విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ సీజన్‌లో మొసలి కనిపించడం ఇది మూడోసారి అని స్థానికులు పేర్కొన్నారు. గతంలో కూడా కిషన్‌బాగ్ సమీపంలోని అసద్ బాబానగర్, చైతన్యపురి వద్ద మూసీ నదిలో మొసళ్లు కనిపించాయన్నారు. కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ భారీగా వరద పొట్టెత్తింది. దీంతో ఇటీవలే డ్యాం గేట్లు కూడా తెరవడంతో నదిలో మొసలి వరదలో కొట్టుకు వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు.