భారత్ సమాచార్, జాతీయం ;
కష్టపడి పని చేసి దేశ ప్రజలకి అన్నం పెట్టే అన్నదాతలకు అండగా నిలవటం కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. వాటిల్లో రైతన్నలకు తక్కువ వడ్డీ కే రుణాలు ఇవ్వటానికి ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రారంభించింది. అర్హత గల రైతులు తమకు సేవింగ్స్ ఖాతా ఉన్న బ్యాంకు లో ఆఫ్ లైన్ / ఆన్ లైన్ ద్వారా ఈ కార్డును పొంది తక్కువ వడ్డీకే రుణం పొందవచ్చు. ఒక్కసారి కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే దానికి ఐదేళ్ల కాల పరిమితి ఉంటుంది. ఈ 5 ఏళ్ల కాలంలో రైతు రూ.3 లక్షల వరకు తక్కువ వడ్డీకే రుణం పొందవచ్చు. సరైన సమయంలో రుణం చెల్లిస్తే వడ్డీ 4% లేదా అంతకన్నా తక్కువగా ఉంటుంది. వాస్తవానికి వడ్డీ రేటు ఏడాదికి 7% ఉంటుంది. అయితే తీసుకున్న రుణాలు సంవత్సరం లోపు చెల్లించే రైతులకు వడ్డీ రేటు 3% వరకు తగ్గిస్తారు.
కిసాన్ క్రెడిట్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
* ముందుగా ఏ బ్యాంక్ నుంచైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
* హోమ్‌పేజీలో కనిపించే ఆప్షన్స్ నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఎంచుకోని, అప్లై బటన్ మీద క్లిక్ చేయాలి.
* దరఖాస్తు ఫారంలో అడిగిన వివరాలన్నీ నమోదు చేసి, Submit బటన్‌పై క్లిక్ చేయాలి.
* మీరు సమర్పించిన వివరాలను బ్యాంక్ ధృవీకరించుకుంటుంది. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, కొన్ని రోజుల్లో కిసాన్ క్రెడిట్ కార్డు జారీ అవుతుంది.