August 22, 2025 2:35 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

CP RadhaKrishnan: ప్రధాని మోదీ సమక్షంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్

భారత్ సమాచార్.నెట్: ఎన్డీఏ కూటమి తరఫున భారత్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ప్రధాని మోదీ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు తన నామినేషన్ పత్రాలలను అందించారు సీపీ రాధాకృష్ణన్. ఆయన నామినేషన్ పత్రాలపై తొలి సంతకం ప్రధాని మోదీ చేయగా.. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు సంతకాలు చేశారు.

 

అయితే లోక్‌​సభ, రాజ్యసభ ఎలక్ట్రోరల్ కాలేజీ ప్రకారం ఎన్డీఏకు సంపూర్ణ బలం ఉండటంతో ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గెలుపు దాదాపు ఖాయమేనని సదురు వర్గాలు విశ్వసిస్తున్నాయి. కానీ విపక్షాలు కూడా తమ తరఫున సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపింది. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అధికార పక్షం ప్రయత్నిస్తుంది. కానీ విపక్షాలు ఇందుకు సుముఖత చూపడం లేదు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది.

 

ఇకపోతే ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చే నెల అంటే సెప్టెంబర్‌లో జరగనుంది. ఎన్డీఏకి సంఖ్యా బలం అధికంగా ఉండటంతో రాధాకృష్ణన్ ఎన్నిక దాదాపు ఖాయమే. రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, దేశ అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉపరాష్ట్రపతి పదవి కూడా ఒకటి.

మరిన్ని కథనాలు:

మళ్లీ ఆ కూటమి అభ్యర్థే ఉపరాష్ట్రపతి.. ఎందుకంటే ?

Share This Post