భారత్ సమాచార్.నెట్, నంద్యాల: దేశంలో బాలికలపై అత్యాచారాలు, మహిళలపై వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నిందితులకు ఎన్ని కఠిన శిక్షలు అమలు చేసినా వారిలో మార్పు రావడంలేదు. నిత్యం ఎక్కడో ఓ చోటు దారుణాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బనగానపల్లె మండలం కైప గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కామాంధుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లైంగికంగా లొంగదీసుకుని గర్భవతిని చేసి:
బనగానపల్లె మండలం కైప గ్రామానికి చెందిన ఓ బాలిక(14) పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి లైంగికంగా లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. ఏడాది కాలంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక మగ శిశువుకు జన్మనిచ్చింది. తమ కూతురుకు కడుపునొప్పి స్కూల్ నుంచి ఇంటికి రావడంతో గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలికకు వైద్య పరీక్షలు చేసి గర్భవతి అని నిర్ధారించడంతో తల్లిదండ్రులు కంగుతిన్నారు. తొమ్మిది నెలల తర్వాత బాలికకు డెలివరి చేయడంతో మగ శిశువుకు జన్మనిచ్చింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు నందివర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని కథనాలు: