భారత్ సమాచార్, జనగాం జిల్లా: డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు నడవాలని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్(DMJU) రాష్ట్ర అధ్యక్షులు కే.రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. జనగామలో నిర్వహించిన డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు ప్రధాన మీడియాలో పనిచేసిన జర్నలిస్టులు నేడు డిజిటల్ మీడియాలో ఉంటూ ఇండిపెండెంట్ జర్నలిస్టుగా పని చేస్తున్నారని తెలిపారు. స్వతంత్ర జర్నలిస్టు సామాన్యుల స్వరంగా ఉంటూ ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీస్తూ నిరంతరం జనహితం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని, ప్రతి ఇండిపెండెంట్ జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డుతోపాటు, సబ్సిడీ రుణం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డిజిటల్ మీడియా సమస్యలను వెంటనే పరిష్కరించాలి:
త్వరలోనే హైదరాబాద్‌లోని ప్రజాభవన్ లో డిజిటల్ మీడియా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తామని, ఆ హక్కుల సాధనలో భాగంగా త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను రాజకీయ పార్టీల నాయకులు తమ స్వార్థం కోసం వాడుకుంటూ నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. అనంతరం రాజేంద్రప్రసాద్ సమక్షంలో బైరబోయిన వెంకన్నను డీఎంజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, డీఏంజేయూ జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఎడమ శంకర్, ఉపాధ్యక్షుడిగా మొగిలిపాక రవి, ప్రధాన కార్యదర్శిగా బత్తిని అశోక్‌లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యుగంధర్ తలసిలా, సీనియర్ జర్నలిస్టులు సాధం రాజయ్య, షాన్ పాషా, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:
Thulasichandu ఓ యూబ్యూట్ నిర్వాహకుడికి తులసిచందు స్ట్రాంగ్ వార్నింగ్