భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: కురుస్తున్న భారీ వర్షాలకు బీబీనగర్ చెరువు నిండుకుండను తలపిస్తోంది. బీబీనగర్ ఏయిమ్స్ వద్ద పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. కురుస్తున్న వర్షాలకు వరదనీరు ప్రధాన రహదారిపై వెళ్తుండడంతో వాహనదారులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. గత పదిరోజుల నుంచి బీబీనగర్ ఎయిమ్స్ సర్వీస్ రోడ్డు వద్ద రోడ్డుపై వరదనీరు వచ్చి చేరడంతో ఎయిమ్స్‌లో చికిత్స కోసం వచ్చేవారు, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
Share This Post