భారత్ సమాచార్.నెట్, ప్రకాశం: చీమకుర్తిలో ఓ 13 ఏళ్ల పాఠశాల బాలిక అపహరణ కలకలం రేపింది. అప్పు కోసమే బాలికను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కరోనా సమయంలో బతుకుదెరువు కోసం తిరుపతికి వెళ్లిన బాలిక తండ్రి, అక్కడ ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.5లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇటీవల వారు స్వగ్రామానికి తిరిగి రాగా, ఈశ్వర్ రెడ్డి శుక్రవారం బాలిక చదువుతున్న పాఠశాల వద్దకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు పిలుస్తున్నారని చెప్పి, ఆమెను తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి పోయాడు. అనంతరం బాలికతో తండ్రికి ఫోన్ చేయించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈశ్వర్ రెడ్డి తిరుపతి వైపు పారిపోతున్నట్లు గుర్తించి, నెల్లూరు, తిరుపతి జిల్లా పోలీసులను అప్రమత్తం చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.
మరిన్ని కథనాలు