భారత్ సమాచార్.నెట్: జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరోక్ష పన్నుల విధానంలో కేంద్రం చేసిన ప్రతిపాదనలకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 12 మరియు 28 శాతం శ్లాబులు తొలగించి.. 5 మరియు, 18 శాతం శ్లాబులు మాత్రమే కొనసాగించేందుకు మంత్రుల బృందం అంగీకరించింది. తాజాగా జరిగిన కీలక సమావేశంలో మంత్రులు బృందం ఇందుకు ఆమోదం తెలిపిందని బిహార్ ఉప ముఖ్యమంత్రి, జీవోఎం కన్వీనర్ సామ్రాట్ చౌదరి తెలిపారు.
జీఎస్టీలోని 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబులు ఉన్న సంగతి తెలిసిందే. మార్కెట్‌లోని అన్ని వస్తువులపై ఈ శ్లాబుల ప్రాకారమే పరోక్ష పన్నులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే 5 శాతం, 18 శాతం శ్లాబులను కొనసాగించి.. 12 శాతం, 28 శాతం శ్లాబులను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం తాజాగా ఆమోదం తెలిపింది.
అలాగే కేంద్రం ప్రతిపాదించిన వాటిలో ఆల్ట్రా లగ్జరీ వస్తువులు, సిగరెట్లు వంటివి ‘సిన్ గూడ్స్’ పై 40% పన్ను విధించాలన్న ప్రతిపాదన కూడా చేసింది ప్రభుత్వం. శ్లాబుల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజలకు ఉపశమనం లభించనుంది. 12% కిందకు వచ్చే అనేక వస్తువులు.. ఇప్పుడు 5% శాతం కిందకు వస్తాయి. అలాగే 28 శాతం శ్లాబులోని 90 శాతం వస్తువులు.. ఇప్పుడు 18% కిందకు వస్తాయి.
మరిన్ని కథనాలు:
GST Relief: జీఎస్టీ తగ్గింపు ఆలచలో కేంద్రం.. వీటి ధరలు తగ్గే అవకాశం!