భారత్ సమాచార్.నెట్, ముంబై: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తన్నాయి. ఉత్తరాదితో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడి జన జీవనం స్తంభించిపోయింది. మరో రెండు రోజులు వర్షాలు ఇలానే కురవనున్నట్లు భారత్ వాతావరణ శాఖ ప్రకటించింది.
దీంతో ఆయా జిల్లాలకు రెండ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఐఎండీ హెచ్చిరికలతో అప్రమత్తమైన ముంబై పోలీసులు .. అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు భారీ వర్షాలు కారణంగా అన్ని పాఠశాలలు, కాలేజీలకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సెలవు ప్రకటించింది. అక్కడి స్కూల్‌లకు సెలవు ప్రకటించగా.. విమాన ప్రయాణం చేసే ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరాయి.
ఇకపోతే ఉత్తరాది రాష్ట్రాల్లోను భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన మార్గాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో.. రోడ్లు దెబ్బతిని 15 పంచాయతీలకు సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో దాదాపుగా 355 రోడ్లు మూతపడ్డాయి.