భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రేకుల ఇళ్లు, పశువుల కొట్టాలు, చెట్లు కూలిపోతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్మనారు. బీబీనగర్ మండల కేంద్రంలో నిన్నకురిసిన భారీ వర్షానికి రైల్వేస్టేషన్ నుంచి పోచంపల్లికి వెళ్లే దారిలో చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో రహదారిపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు వెంటనే స్పందించిన రోడ్డుపై పడ్డ చెట్టును తొలగించాలని స్థానికులు కోరారు.
మరిన్ని కథనాలు:
Share This Post