August 18, 2025 2:38 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Tirumala: వరుస సెలవులు.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

భారత్ సమాచార్.నెట్, తిరుమల: కలియుగ ప్రత్యక్షే దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో అనూహ్యంగా భక్తుల రద్దీ నెలకొంది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో వెంకన్న గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీతో శ్రీవారి ఉచిత దర్శనానికి దాదాపుగా 24 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపట్టింది.

 

పంద్రాగస్టు, శనివారం శ్రీ కృష్ణాష్టమి, ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రల భక్తులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు భక్తులతో కికిరిసిపోయాయి. దీంతో భక్తుల కోసం అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తోంది టీటీడీ. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసిన టీటీడీ.. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

 

ఇకపోతే నేటి నుంచి తిరుమల అలిపిరిలో కొత్త రూల్ అమలులోకి వచ్చింది. శ్రీవారి దర్శనానికి వాహనాల్లో వచ్చే భక్తులు.. వారి వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది టీటీడీ. ఈ నిర్ణయం నేటి నుంచే అమలు అయ్యింది. శ్రీవారి దర్శనానికి కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిర్ణయంతో అలిపిరి వద్ద ట్రాఫిక్ జామ్ కష్టాలు తీరనున్నాయి.

Share This Post