August 22, 2025 2:40 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

India-Nepal: సరిహద్దు వాణిజ్యంపై నేపాల్ అభ్యంతరం.. ఖండించిన భారత్

భారత్ సమాచార్.నెట్: భారత్, చైనాల మధ్య ఇప్పుడిప్పుడే సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ క్రమంలోనే నేపాల్ మీదుగా వాణిజ్య సరిహద్దులను పునరుద్ధరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. భారత్, చైనా రెండు దేశాలతో నేపాల్ సరిహద్దు పంచుకుంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇరు దేశాలు నేపాల్ మీదుగా వాణిజ్యాన్ని ప్రారంభించాలని నిర్ణయించాయి. రెండు రోజులుగా భారత్‌లో పర్యటిస్తున్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన విషయాలపై చర్చించారు. ఈ చర్చల్లో నేపాల్ సరిహద్దు విషయం కూడా ఒకటి.

 

అయితే భారత్, చైనా తీసుకున్న ఈ నిర్ణయంపై నేపాల్ అభ్యంతరం తెలిపింది. మహాకాళి నదికి తూర్పున ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణిలు తమ దేశంలో భాగామని.. తమ మ్యాప్‌లోను ఇదే స్పష్టమవుతోందని.. ఈ విషయాన్ని ఇప్పటికే చైనాకు తెలియజేశామని నేపాల్ విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. తమ దేశం మీదుగా వాణిజ్యం చేయాలనుకుంటే తమ అనుమతి కూడా నేపాల్ స్పష్టం చేసింది. భారత్ నేపాల్ మధ్య ఉన్న సరిహద్దు సమస్యను చర్చలతో పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపింది.

 

మరోవైపు నేపాల్ వాదనలపై భారత్ విదేశాంగా తీవ్రంగా స్పందించింది. లిపులేఖ్ ద్వారా భారత్ చైనాల మధ్య సరిహద్దు వాణిజ్యం తిరిగి ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరం చెప్పడాన్ని భారత్ ఖండించింది. లిపులేఖ్ మీదుగా భారత్, చైనా మధ్య వ్యాపారం 1953 నుంచే ఉందని… మధ్యలో కొన్ని కారణాల వలన నిలిచిపోయిందని భారత్ పేర్కొంది. ఇప్పుడు దాన్నే తిరిగి ప్రార:బించాలని అనుకుంటున్నామని.. లిపులేఖ్…నేపాల్ ఉందనే వాదనకు ఎటువంటి చారిత్రక ఆధారం లేదని భారత్ స్పష్టం చేసింది. దీనిని నేపాల్ కృత్రిమంగా ఏర్పాటు చేసుకుందని.. దానిని అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది.

 

మరిన్ని కథనాలు: 

India-China: చైనా పౌరులకు భారత్ టూరిస్ట్ వీసాలు

Share This Post