August 22, 2025 2:33 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

ISRO: 40 అంతస్థుల భవనం అంత రాకెట్.. ఇస్రో నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదే

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతో ముందుకెళుతూనే ఉంటుంది. భారత్ సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇస్రో తదుపరి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఇస్రో చైర్మెన్ వి.నారాయణన్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ఇస్రో తదుపరి ప్రాజెక్టు విషయాలను పంచుకున్నారు.

 

ఏకంగా నలభై అంతస్తుల భవనమంత ఎత్తైన భారీ రాకెట్‌ రూపకల్పనలో నిమగ్నమై ఉన్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం నావిక్ ఉపగ్రహం, N 1 రాకెట్ ప్రయోగం, అమెరికాకు చెందిన 6,500 కిలోల బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రాజెక్టులు తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం భారత్‌కు కక్ష్యలో 55 ఉపగ్రహాలు ఉన్నాయని, వీటి సంఖ్యను మూడు లేదా నాలుగు రెట్లకు పెంచనున్నామని తెలిపారాయన.

 

గతంలో ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ చేసిన ప్రాజెక్టు గురించి కూడా ఓ విషయం పంచుకున్నారు. అప్పట్లో ఆయన తయారు చేసిన తొలి రాకెట్‌ 17 టన్నుల లిఫ్ట్ఆఫ్ బరువుతో 35 కిలోల శాటిలైట్‌ను దిగువ భూకక్ష్యకు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈరోజు 75 టన్నుల బరువైన పేలోడ్‌ను దిగువ భూకక్ష్యలో ప్రవేశపెట్టంపై పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి కావాల్సిన రాకెట్‌ 40 అంతస్తుల భవనమంత ఎత్తు ఉంటుందని తెలిపారు.

 

మరిన్ని కథనాలు:

ఇస్రో లో ఉచితంగా ఆన్ లైన్ కోర్సులు

 

Share This Post