August 22, 2025 2:35 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

దారుణం.. పల్సర్ బైక్ కొనివ్వలేదని గొడ్డలితో నరికేశాడు

భారత్ సమాచార్.నెట్, ఖమ్మం: తండ్రి పల్సర్ బైక్ కొనివ్వలేదని కొడుకు తండ్రిపై దాడి చేసి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన నాగయ్య కుమారుడు సతీష్ ఎనిమిదో తరగతి చదుకుని జులాయిగా తిరుగుతున్నారు. ఈ క్రమంలో తనకు ద్విచక్రవాహనం కొనివ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. తమ వద్ద డబ్బులు లేవని చెప్పడంతో గత అర్ధరాత్రి తండ్రి నాగయ్యపై కొడుకు సతీష్ గొడ్డలితో దాడి చేశాడు. దీంతో నాగయ్య భార్య నాగలక్ష్మి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేసరికి సతీష్ పరారయ్యాడు.

డబ్బులు ఇవ్వాలేదని తండ్రిని గొడ్డలితో నరికేశాడు:

తాగుడుకు బానిసైన సతీష్ పోకిరీలతో తిరగడానికి ఖర్చులు కోసం తల్లిదండ్రులు వద్ద డబ్బులు తీసుకునే వాడు. ప్రతి రోజూ ఇచ్చే స్థోమత లేకపోవడంతో తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. చివరికి తనకు పల్సర్ బైక్ కొనివ్వాలని సెల్ ఫోన్ రీఛార్జ్ చేయాలని తండ్రితో గొడవ పడ్డాడు.మాటా మాట పెరిగి సతీష్ తండ్రి నాగయ్యను గొడ్డలితో నరికేశాడు. తండ్రిని నరికిన తర్వాత తల్లి నాగలక్ష్మిని కూడా గొడ్డలితో వెంటాడాడు. ఆమె ప్రాణభయంతో పారిపోయి కేకలు వేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. స్థానికుల సాయంతో తీవ్ర గాయాలతో ఉన్న నాగయ్యను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నాగయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తన భర్త నాగయ్యపై కుమారుడు సతీష్‌ చేసిన దాడిపై నాగలక్ష్మి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు సతీష్‌‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 

మరిన్ని కథనాలు:

దారుణం.. యువతిపై ప‌ది మంది సామూహిక అత్యాచారం

Share This Post