భారత్ సమాచార్.నెట్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి, నిధుల కోసం ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసిన విషయం తెలిసిందే. టీడీపీ పార్టీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్‌ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు నారా లోకేష్ బర్త్ డే విషెస్ తెలిపి కేక్ కట్ చేయించారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. ఎంపీ సానా సతీష్ రానున్న రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని, దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఎంపీ సానా సతీష్ నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని కథనాలు:
Share This Post