భారత్ సమాచార్, భక్తి: హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను నిర్వహిస్తారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు రావణాసురుడిని సంహరించిన రోజు, దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన సందర్భం విజయదశమి ప్రాధాన్యతను తెలియజేస్తాయి. 2026లో అక్టోబర్ 20, మంగళవారం విజయదశమి నిర్వహించనున్నట్లు పేర్కొంటున్నారు. ఈ పర్వదినం సందర్భంగా అమ్మవారిని పూజించడంతోపాటు ఆయుధాలు, వృత్తిపరమైన పనిముట్లు, యంత్రాలు, వాహనాలను ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రాచీన కాలంలో…