భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట్ గ్రామంలోని శ్రీ రామాలయంలో దుర్గామాత పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పులిమామిడి నవీన్ గుప్తా ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని దుర్గామాతకు భక్తిపూర్వకంగా ప్రార్థనలు చేశారు. గ్రామ ప్రజలందరిపై అమ్మవారి కృపాకటాక్షాలు ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దుర్గామాత పూజా కార్యక్రమాల నిర్వహణకు…






