భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రకృతి స్వరూపుడైన మట్టి గణపతికి భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు కొనసాగుతున్నాయి. స్టూడెంట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విఘ్నేశ్వరుడి ఉత్సవాలకు కలమ్మ జనరల్ స్టోర్స్ ప్రొప్రైటర్ పోలోజు హయగ్రీవ చారి, భాగ్యలక్ష్మి దంపతులు రూ.30 వేల విలువైన మట్టి గణపతి విగ్రహాన్ని అందజేశారు.
విఘ్నేశ్వరుడు తన తండ్రి మహాశివుని లింగానికి జలాభిషేకం చేస్తూ, జలధార కురిపిస్తున్న రూపంలో రూపొందించిన ఈ మహా గణపతి విగ్రహాన్ని భక్తులు…






