భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వినాయక ఉత్సవాల నేపథ్యంలో నర్సాపూర్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణపై మెదక్ జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసింది.

మెదక్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సాపూర్ పట్టణంలోని వినాయక మండపాల వద్ద పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డాగ్ స్క్వాడ్‌తో పాటు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది కూడా పాల్గొని మండపాలు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా…