భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం బడి తండాలో గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపిస్తూ తండాకు చెందిన బానోత్ శ్రీకాంత్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నెల్లికుదురు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో సింగారపు కుమార్‌కు ఫిర్యాదు పత్రం అందజేశారు.

బడి తండా సర్పంచ్, ఉపసర్పంచ్‌లు చేపట్టిన పనులకు వాస్తవ ఖర్చు కంటే ఎక్కువ మొత్తంలో నిధులు డ్రా చేసినట్లు శ్రీకాంత్ ఆరోపించారు. బడి తండా శివారులోని రేగడి తండా వరకు రహదారి కోసం కేవలం 100…