భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేటను నియోజకవర్గ కేంద్రంగా పునరుద్ధరించాలని బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మెట్టు గంగారం కోరారు. రామాయంపేటలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ డిమాండ్‌ను వెల్లడించారు.
రామాయంపేటను మళ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి
గతంలో రామాయంపేట నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్న సమయంలో డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా రద్దయిన విషయం అందరికీ తెలిసిందేనని మెట్టు గంగారం తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్న నేపథ్యంలో రద్దయిన రామాయంపేట నియోజకవర్గాన్ని మళ్లీ పునరుద్ధరించాలని కోరుతున్నట్లు చెప్పారు.






