భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులు సంఘటితంగా ఏర్పడి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని రామాయంపేట మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సింగ్ లింగాపూర్ గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీఓ) ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన సదస్సుతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎఫ్‌పీఓలతో రైతులకు ప్రయోజనాలు
గ్రామీణ వ్యవసాయాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కీలకంగా ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా…






