భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో ఆహార పదార్థాల నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే ఫుడ్ పాయిజన్ ఘటనతో వార్తల్లో నిలిచిన పట్టణంలో తాజాగా సిటీ ప్యాలెస్లో విక్రయించిన సమోసాలో గుట్కా ఆనవాళ్లు కనిపించాయంటూ ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన బస్టాండ్ ప్రాంగణానికి ఎదురుగా ఉన్న సిటీ ప్యాలెస్లో చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం.
సమోసాలో అవశేషాలపై ఫిర్యాదు
ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి హనుమంతు తెలిపిన వివరాల ప్రకారం.. సిటీ ప్యాలెస్లో కొనుగోలు చేసిన…






