భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో మహిళలు సందడి చేయడంతో కార్యాలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు

ఈ వేడుకల్లో ఎక్సైజ్ శాఖకు చెందిన మహిళా హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, ఇతర మహిళలు, యువతులు పెద్ద…