భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మాచునూరి లక్ష్మీరాజు యాదవ్, కమిషనర్ చెరుకు సాయికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, పూజలు నిర్వహించి, సంప్రదాయ పాటలతో ఆడి పాడుతూ సందడి చేశారు.
సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పూజలు
మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మహిళా ఉద్యోగులు ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మను…






