భారత్ సమాచార్, హైదరాబాద్: ఉత్తర అమెరికాలో తెలుగు ప్రజల సంక్షేమం, సామాజిక సేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) న్యూజెర్సీ చాప్టర్‌కు కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. చాప్టర్ లీడర్‌గా సాయి గంగులను నియమించింది. నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల పాల్గొన్న ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ఈ నియామకాన్ని ప్రకటించారు. న్యూజెర్సీలో తెలుగు సమాజాన్ని మరింత చేరువ చేయడం, యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం, సంఘం కార్యకలాపాలను విస్తరించడం లక్ష్యంగా…