భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల పునర్నిర్మాణ యోధుల ఆత్మీయ అలైబలై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకుని మాజీ ఎంపీపీ గుండా ఎల్లం అధ్యక్షతన ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ…