భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని మల్లెచెరువు ఎఫ్‌టీఎల్‌ (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాంతాన్ని సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువు కబ్జాకు గురవుతోందన్న సమాచారంతో అధికారులు చెరువు పరిసరాలను సందర్శించి, ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. చెరువు పరిధిని గుర్తించి, నీటి వనరులను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంపై దృష్టి సారించారు.

చెరువు పరిధిపై క్షేత్రస్థాయి పరిశీలన

మెదక్ ఆర్డీఓ రమాదేవి, రామాయంపేట తహశీల్దార్ రజనీకుమారి, ఇరిగేషన్ ఏఈ సూర్యకాంత్, మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ తదితరులు మల్లెచెరువు…