భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో త్రినేత్ర యూత్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమాలతో వార్డులో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ప్రత్యేక పూజలు.. కుంకుమార్చన
నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య భక్తులు కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలందరూ…






