భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దసరా పండుగ సందర్భంగా పాలపిట్టను పట్టుకోవడం, పంజరంలో బంధించడం లేదా దానికి హాని కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నర్సాపూర్ FRO దివ్య హెచ్చరించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం పాలపిట్టను వేటాడటం, హింసించడం వంటి చర్యలు నేరమని ఆమె స్పష్టం చేశారు.
పాలపిట్టకు హాని చేస్తే కఠిన చర్యలు
పాలపిట్టను పట్టుకొని పంజరంలో బంధించినా, వేటాడినా, హింసించినా చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని దివ్య తెలిపారు. పక్షి స్వేచ్ఛగా ఎగరకుండా దాని…






