భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పే సద్దుల బతుకమ్మ వేడుకలు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో అట్టహాసంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగిన బతుకమ్మ ఉత్సవాలు చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగియడంతో పట్టణంలో పండుగ సందడి నెలకొంది.

రంగురంగుల పూలతో బతుకమ్మలు

వివిధ రకాల పూలను సేకరించిన మహిళలు వాటిని అందంగా పేర్చి పెద్దపెద్ద బతుకమ్మలను సిద్ధం చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో వేడుకల్లో పాల్గొన్నారు. వీధివీధినా బతుకమ్మలను ఏర్పాటు చేసి,…