భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకమైన సంప్రదాయమని మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి తెలిపారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ఆదివారం పాపన్నపేట మండలం కుర్తివాడలో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ సందడి చేశారు.

పూల అందాల నడుమ బతుకమ్మ వేడుకలు

కుర్తివాడలో మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి వేడుకలకు సిద్ధమయ్యారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ గీతాలను…