భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా జరిగాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన తొమ్మిది రోజుల పూల పండుగ చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసింది. ఈ సందర్భంగా పట్టణంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకున్నారు.
పూలతో అందంగా బతుకమ్మల అలంకరణ
వివిధ రకాల రంగురంగుల పూలను సేకరించిన మహిళలు వాటితో ఆకర్షణీయంగా పెద్దపెద్ద బతుకమ్మలను పేర్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, వీధివీధినా బతుకమ్మలను…






