భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే సద్దుల బతుకమ్మ వేడుకలు ఇనుగుర్తి మండలంలో ఆదివారం వైభవంగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు చిన్ననాగారం, కోమటిపల్లి, అయ్యగారిపల్లి, చిన్న ముప్పారం, లక్ష్మీపురం గ్రామాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, గౌరమ్మను శిఖరంపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూలతో అలంకరణ.. భక్తిశ్రద్ధలతో పూజలు
వివిధ రకాల పూలతో బతుకమ్మలను రంగుల గోపురాల్లా తీర్చిదిద్దిన మహిళలు ధూపదీప నైవేద్యాలు…






