భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో అందంగా అలంకరించిన బతుకమ్మలకు స్థానిక BRS నాయకులు బహుమతులు అందజేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలను ప్రోత్సహించేందుకు ఈ బహుమతులు అందించారు.
బహుమతులు గెలుచుకున్న విజేతలు
ఈ పోటీల్లో చెడుపాక కవిత ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. ఈ బహుమతిని దాతలు చెడుపాక యాకూబ్, కవిత అందజేశారు.
గుండ్ల అరుణ ద్వితీయ బహుమతిని కైవసం చేసుకోగా, వార్డు సభ్యుడు బైరు వినయ్ గౌడ్,…






